ఆధ్యాత్మికం: గుళ్లో హారతి ఇచ్చేటప్పుడు.. కళ్లు మూసుకోవాలా.. దేవుడిని చూస్తూ ఉండాలా..

ఆధ్యాత్మికం:  గుళ్లో హారతి ఇచ్చేటప్పుడు.. కళ్లు మూసుకోవాలా.. దేవుడిని చూస్తూ ఉండాలా..

పండుగకో.. పబ్బానికో  గుడికి వెళతారు.  అక్కడ భగవంతునికి దండం పెట్టుకోవడం... గంట కొట్టడం.. హారతి తీసుకోవడం ఇలా అనేక రకాలుగా స్వామి సేవలో ఉంటాము.  కాని కొంతమంది హారతి సమయంలో కొంతమంది కళ్లు మూసుకుంటారు. మరి కొంతమంది  స్వామిని చూస్తూ అలా ఉంటారు.  పురాణాల ప్రకారం.. కళ్లు మూసుకోవాలా.. స్వామిని చూస్తూ ఉండాలా.. ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . .

దేవాలయంలో హారతి ఇచ్చేటప్పుడు కొంతమంది భక్తులు కళ్ళు మూసుకుంటారు.  కళ్లుమూసుకొని స్వామిని ధ్యానిస్తూ .. అంతర్గతంగా భక్తిలో మునిగిపోతారు.  మరికొంతమంది  భక్తులు దేవుని విగ్రహాన్ని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. 

స్కంధ పురాణం.. పద్మ పురాణాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారని గ్రంథాల ద్వారా తెలుస్తుంది.  హారతి సమయంలో దేవుని విగ్రహాన్ని చూస్తూ భక్తి పారవశ్యంలో ఉండాలని పండితులు చెబుతున్నారు.  ఇలా చేయడం వలన అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని గ్రంధాల్లో ఉందని చెబుతున్నారు.  దేవుడికి హారతి ఇచ్చే సమయంలో  దేవుడి విగ్రహాన్ని చూడటం వలన  ఆత్మతో కూడా భక్తి అనుసంధానించబడుతుంది.  

కాని కొంతమంది భక్తులు హారతి సమయంలో భావోద్వేగంతో కళ్ళు మూసుకుంటారు.  అలా వారు అంగర్గతంగా స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. అలా కాకుండా స్వామిని చూస్తూ ఉండాలని చెబుతున్నారు. 

దీపం వెలుగులో గంట శబ్దం మన ఇంద్రియాలను ప్రభావితం చేస్తాయి. అవి మెదడులో సానుకూల ప్రతి స్పందనను కలుగజేస్తాయి. ఇలా చేయడం వలన  మనస్సకు శాంతి..శక్తి.. ధ్యాన స్థితి కలుగుతాయని పండితులు అంటున్నారు.  కళ్లు మూసుకోవడం వలన దీపం వెలుగులో స్వామిని చూసే అవకాశం కోల్పోతుందని పండితులు అంటున్నారు. అయితే హారతి సమయంలో కళ్లు మూసుకోవడం తప్పు కాదు కాని... హారతి ప్రయోజనాన్ని పొందలేమని అంటున్నారు. 

హారతి ఇచ్చే పళ్లెంలో  పత్తి.. నెయ్యి.. కర్పూరం.. పువ్వులు.. గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు.  పత్తి స్వచ్చతకు ప్రతిరూపం.. కర్పూరాన్ని వెలిగించడం ద్వారా  సుగంద పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.