కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
  •     డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు : కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. నగరంలోని పార్టీ జిల్లా ఆఫీస్​లో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించుకోవాలన్నారు. పార్టీ పునాది కార్యకర్తలేనని, ఎవరూ నిరాశ చెందకుండా డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 

సమావేశంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.