హార్దిక్‌‌‌‌‌‌‌‌కు మరో హార్ట్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌.. జాస్మిన్ వాలియాతో బ్రేకప్..!

హార్దిక్‌‌‌‌‌‌‌‌కు మరో హార్ట్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌.. జాస్మిన్ వాలియాతో బ్రేకప్..!

ముంబై: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమ జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఫ్  నటాషా స్టాంకోవిచ్‌‌‌‌‌‌‌‌తో విడాకుల తర్వాత పాండ్యా బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ లవ్ జర్నీకి కూడా బ్రేకప్ పడిందని తెలుస్తోంది. హార్దిక్, జాస్మిన్ ఇద్దరూ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ఒకరినొకరు అన్‌‌‌‌‌‌‌‌ఫాలో చేసుకోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే, ఈ విషయంపై ఇద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

గత ఐపీఎల్ సీజన్‌‌‌‌‌‌‌‌లో జాస్మిన్.. పాండ్యా ఆడిన ముంబై ఇండియన్స్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు హాజరై అతనికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దీనికి తోడు, గ్రీస్‌‌‌‌‌‌‌‌లో వీరిద్దరూ ఒకే చోట రొమాంటిక్‌‌‌‌‌‌‌‌గా దిగిన ఫోటోలు కూడా వైరల్‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో ఈ జంట లవ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్ బయటపడింది.  కానీ, ఇది ఎంతో కాలం నిలవకుండా పోయిందని తెలుస్తోంది. కాగా, హార్దిక్ పాండ్యా 2020లో సెర్బియాకు చెందిన మోడల్ నటాషా స్టాంకోవిచ్‌‌‌‌‌‌‌‌ను పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఆగస్త్య అనే మూడేండ్ల కొడుకు ఉన్నాడు. కానీ, గతేడాది పాండ్యా, నటాషా విడాకులు తీసుకుని విడిపోయారు.