ధోని, కోహ్లీ, రోహిత్లకు సాధ్యం కాని రికార్డు పాండ్యా సొంతం

ధోని, కోహ్లీ, రోహిత్లకు సాధ్యం కాని రికార్డు పాండ్యా సొంతం

భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో మొదటి ఐదు మ్యాచుల్లో ఓటమి ఎరుగని టీమిండియా కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్ టైగా ముగియడంతో పాండ్యా ఈ రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు.  భారత జట్టు మేటి కెప్టెన్ గా పెరొందించిన ధోనితో పాటు కోహ్లీ, తాజా కెప్టెన్ రోహిత్ శర్మలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. 

ఐర్లాండ్ నుంచి న్యూజిలాండ్ వరకు 
ఈ ఏడాదే ఐర్లాండ్ పర్యటించిన టీమిండియాకు హార్దిక్ కెప్టెన్గా వ్యవహరించాడు.  రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్లీప్ చేశాడు. ఆ తర్వాత విండీస్ తో జరిగిన సిరీస్లో  ఓ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్ లో 88 పరుగులతో  టీమిండియా విజయం సాధించాడు.  తాజాగా జరిగిన న్యూజిలాండ్  పర్యటనలో తొలి టీ20 రద్దయింది. ఇక  రెండో టీ20లో భారత జట్టు 65 పరుగులతో గెలిచింది. చివరి మ్యాచ్ వర్షం కారణంగా టైగా ముగిసింది. దీంతో ఓటమే ఎరుగని కెప్టెన్‌గా హార్దిక్ చరిత్రకెక్కాడు. 

వాన కారణంగా టై అయింది.
మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన  న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది.  కాన్వే 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయగా.., గ్లేన్ ఫిలిప్స్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 రన్స్ సాధించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్,  సిరాజ్ 4 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. 161 పరుగుల  లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. పాండ్యా18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30 పరుగులు చేశాడు.  దీపక్ హుడా 9 రన్స్ సాధించాడు. ఇషాన్ కిషన్(10), రిషభ్ పంత్(11), శ్రేయస్ అయ్యర్(0) విఫలమయ్యారు.