V6 News

IND vs SA: ఒక్కడే నిలబడ్డాడు: పాండ్య మెరుపులతో టీమిండియాకు సూపర్ టోటల్

IND vs SA: ఒక్కడే నిలబడ్డాడు: పాండ్య మెరుపులతో టీమిండియాకు సూపర్ టోటల్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో ఇండియా బ్యాటింగ్ లో పర్వాలేదనిపించింది. కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) జరుగుతున్న ఈ మ్యాచ్ లో సఫారీ బౌలింగ్ ధాటికి ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఒక్కడే మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు యావరేజ్ స్కోర్ అందించాడు. పాండ్య సూపర్ ఫిఫ్టీకి తోడు అక్షర్ పటేల్, తిలక్ వర్మ రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాండ్య 28 బంతుల్లోనే 59 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టాడు. సిపమాల రెండు.. ఫెరీరా ఒక వికెట్ తీసుకున్నారు.           

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ శుభమాన్ గిల్ తొలి బంతినే ఫోర్ కొట్టి రెండో బాల్ ఔటయ్యాడు. ఎంగిడి వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపడిన గిల్.. మిడాఫ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత  పేలవ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మూడో ఓవర్లో కేవలం 11 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కూడా క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడలేదు. 17 పరుగులే చేసి పవర్ ప్లే తర్వాత ఔటయ్యాడు. దీంతో ఇండియా 48 పరుగులకే టాపార్డర్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. 

ALSO READ : పొగుడుతూనే పక్కన పెట్టారుగా.. టీమిండియా ప్లేయింగ్ 11లో ఆ ఇద్దరికీ మరోసారి అన్యాయం

ఈ దశలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ 30 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బందిపడిన తిలక్ వర్మ 32 బంతుల్లో 26 పరుగులు చేసి నిరాశపరిచాడు. 23 పరుగులు చేసిన అక్షర్ పెవిలియన్ కు చేరడంతో 105 పరుగుల వద్ద ఇండియా 5 వికెట్లు కోల్పోయి సగం జట్టును కోల్పోయింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ 16 ఓవర్లో మహరాజ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి దూకుడు చూపించిన హార్దిక్.. అదే జోరును చూపించాడు.  దూబేతో కలిసి పరుగుల వరద పారించాడు. చివరి వరకు క్రీజ్ లో జట్టు స్కోర్ ను 175 పరుగులకు చేర్చాడు.