
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ టీమ్‌కు కెప్టెన్‌గా వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఈ మేరకు పాండ్యాతో ఫ్రాంచైజీ చర్చలు జరుపుతోందని సమాచారం. మెగా ఆక్షన్‌కు ముందే ఈ డీల్ కంప్లీట్ అయ్యే చాన్స్ ఉంది. ఈ నెల 31 వరకు ముగ్గురు ప్లేయర్ల లిస్ట్‌ను పంపాలని బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలకు గడువు విధించిన సంగతి తెలిసిందే. దీంతో అహ్మదాబాద్ ప్లేయర్లతో చర్చలను స్పీడప్ చేసింది. హార్దిక్‌తో పాటు అఫ్గాన్ టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కూడా డీల్ ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు థర్డ్ ప్లేయర్‌గా క్రునాల్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లో ఒకర్ని తీసుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఇక ఫిక్సింగ్ కంపెనీలతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను బోర్డు సోమవారం ఫ్రాంచైజీకి అందజేసింది.