
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య రెండో సారి స్లో ఓవర్ రేట్ కు గురయ్యాడు. మంళవారం (మే 6) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో రెండో సారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొన్న రెండో కెప్టెన్ గా నిలిచాడు. టాస్ ఓడి ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. గుజరాత్ ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ లో మార్పులు చేయడానికి హార్దిక్ ఎక్కువగా సమయం తీసుకున్నాడు.
రెండో సారి స్లో ఓవర్ రేట్ కావడంతో ఈ సారి కెప్టెన్ తో పాటు ముంబై జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు కూడా ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు టోర్నమెంట్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానా విధించబడుతుంది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్ష అనుభవించిన కెప్టెన్ల లిస్ట్ లో పాండ్యతో పాటు శుభ్‌మాన్ గిల్ (గుజరాత్), అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్), రజత్ పాటిదార్ ( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్ ), రిషబ్ పంత్ (ముంబై ఇండియన్స్) ఉన్నారు.
ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. ఈ నిషేధం తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య అన్ని విభాగాల్లో విఫలమయ్యాడు. మొదట బ్యాటింగ్ లో ఒక్క పరుగు మాత్రమే చేసిన పాండ్య.. ఆ తర్వాత బౌలింగ్ లో ఒకే ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చాడు. ఇక ఫీల్డింగ్ లోనూ చివర్లో రనౌట్ ఛాన్స్ ఉన్నా త్రో విసరడంలో విఫలమయ్యాడు.
►ALSO READ | కరణ్ వీర్,కిర్ఫాల్ పై నిషేదం రెండేళ్లకు తగ్గింపు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే వర్షం అంతరాయంతో ఆగుతూ.. సాగుతూ ఆఖరి బాల్ వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మంగళవారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై 20 ఓవర్లలో 155/8స్కోరు చేసింది. అనంతరం వర్షం కారణంగా గుజరాత్ టార్గెట్‌ను డీఎల్‌ఎస్ ప్రకారం 19 ఓవర్లలో 147 రన్స్‌గా లెక్కగట్టారు. జీటీ ఏడు వికెట్లు కోల్పోయి ఆఖరి బాల్‌కు టార్గెట్‌ను అందుకుంది.
Hardik Pandya has been fined INR 24 lakh for maintaining a slow over-rate against GT.#HardikPandya #IPL #IPL2025 #MIvGT #CricketTwitter pic.twitter.com/wo79wDO596
— InsideSport (@InsideSportIND) May 7, 2025