135 - 145 కు పైగా స్థానాలు గెలుచుకుంటాం : హార్థిక్ పటేల్

135 - 145 కు పైగా స్థానాలు గెలుచుకుంటాం : హార్థిక్ పటేల్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ 135 నుంచి 145 కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని బీజేపీ అభ్యర్థి హార్థిక్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గెలుచుకున్న స్థానాల కంటే ఈ సారి బీజేపీ మరిన్ని ఎక్కువ స్థానాలు తన ఖాతాలో వేసుకుంటుందని జోస్యం చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిస్సందేహంగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గుజరాత్‌ లో మత విశ్వాసాలను దెబ్బతీసిన పార్టీ ఇక్కడ విజయం సాధించదని హార్థిక్ పటేల్ అన్నారు. తమకు తప్పకుండా 135 సీట్లకు పైగానే చేజిక్కించుకుంటామని చెప్పారు. తాము ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఇందులో మీకు ఏమైనా సందేహముందా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ప్రజలు తమకు భద్రత ఉంటుందని నమ్మారని, వారి అంచనాలను కూడా నెరవేర్చామని చెప్పారు. గత 20ఏళ్లలో ఇక్కడ ఎలాంటి అల్లర్లు గానీ, ఉగ్రవాద దాడులు గానీ జరగకపోవడమే దానికి ఉదాహరణ అని హార్థిక్ పటేల్ వివరించారు.