హైదరాబాద్, వెలుగు: మిల్లెట్స్ వంటకాల తయారీలో మెళకువలు నేర్చుకునేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది. కోకాపేటలోని హరేకృష్ణ హెడ్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ఉద్దేశం మిల్లెట్స్ తో రకరకాల వంటకాలు ఎలా చేయాలనే దానిపై పూర్తి అవగాహన పెంచుకోవడమేనని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. సామాన్యులకు సైతం బలవర్ధక ఆహారాన్ని అందించడమే ఎంఓయూ టార్గెట్ అని చెప్పారు.
