-
అంతవరకు ఉద్యమం ఆపం
-
ఆయన త్వరలో బీజేపీలో చేరతడు
-
కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్
హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్‌రావును జైలుకు పంపడం ఖాయమని కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రంగనాయక సాగర్ భూముల విషయంలో హరీశ్‌రావు పాల్పడిన అక్రమాలను తాను బయటపెట్టడంతో గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని చెప్పారు. హరీశ్‌రావును జైలుకు పంపించే వరకు తన ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరేందుకు హరీశ్ యత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్ తన మాటకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా హరీశ్ ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులతో మంతనాలు జరుపుతున్నాడని, త్వరలో ఆయన బీజేపీలో చేరుతాడని ఆయన తెలిపారు.