ఇథియోపియాలో ప్రధాని మోదీకి ఆతిధ్యం: వందేమాతరం ఆలపించిన సింగర్లు

ఇథియోపియాలో ప్రధాని మోదీకి ఆతిధ్యం: వందేమాతరం ఆలపించిన సింగర్లు
  • డిన్నర్‌‌‌‌‌‌‌‌లో వందేమాతరం గేయం ఆలాపన.. 

ఆడిస్ అబాబా: తొలిసారి ఇథియోపియాకు వచ్చిన మోదీకి ఆ దేశ ప్రధాని అబి అహ్మద్ అలీ మంగళవారం రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడి సింగర్లు ముగ్గురు భారత జాతీయ గేయం వందేమాతరం ఆలపించారు. 

దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఇథియోపియా పర్యటన ముగించుకున్న మోదీ.. బుధవారం ఒమన్‌‌‌‌కు వెళ్లారు. ఇథియోపియా  ప్రధాని అబి అహ్మద్ అలీ స్వయంగా కారు నడుపుకుంటూ తీసుకెళ్లి, మోదీని ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో దింపారు.