
హరి హర వీరమల్లు థియేటర్ లాంగ్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే అని సినీ వర్గాల టాక్. జులై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేదు. అంతేకాకుండా దారుణమైన VFXతో, సెకండాఫ్ లోని కథనాలతో ఫ్యాన్స్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ తప్పులు గమనించిన మేకర్స్.. వెంటనే రియాక్ట్ అయ్యి.. కాస్త మార్చి తిరిగి కొత్త కంటెంట్ తీసుకొచ్చినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు.
వీరమల్లు ఓటీటీ:
హరి హర వీరమల్లు మూవీ నెల రోజుల్లోపే ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. థియేటర్ రిజల్ట్ ఎఫెక్ట్ కారణంగా నాలుగు వారాల గ్యాప్‌లోనే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని అమెజాన్ నిర్ణయించుకున్నట్లు వివరాలు బయటకొచ్చాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా (ఆగస్ట్ 22న) వీరమల్లు స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ అదే జరిగితే.. పవన్ కళ్యాణ్ సినిమా నెలరోజుల్లోపే ఓటీటీకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించనుంది.
వీరమల్లు వసూళ్లు:
వీరమల్లు మూవీ సినిమా కలెక్షన్స్ రోజురోజుకూ పడిపోతూ వస్తున్నాయి. సినిమా ప్రీమియర్స్ నుంచి మొదలు అన్నీవైపులా మిక్సెడ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ.. ఫస్ట్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. కానీ, ఇండియాలో మాత్రం ఆ మైల్ స్టోన్కు చాలా దూరంలోనే ఉంది. జులై30 బుధవారం నాటికి.. అంటే 7 రోజుల్లో రూ.80.37 కోట్ల ఇండియా నెట్ సాధించింది.
ఈ క్రమంలో హరి హర వీరమల్లు వంద కోట్ల నెట్ వసూళ్లు సాధించడం కష్టమేనన్న ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీరమల్లు రోజుకో.. కోటి చొప్పున వసూళ్లు చేస్తూ వెళ్తుంది. ఇదిలానే ఉంటే వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఆగిపోయినట్టే అని అంటున్నారు. అంతేకాకుండా నేటి నుంచి (జులై31) కింగ్‌డమ్ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో వీరమల్లు రన్ అవుతున్న థియేటర్స్ కూడా కింగ్‌డమ్‌కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం..
ఇండియాలో రోజువారి వసూళ్లు:
ప్రీమియర్స్ రోజు : రూ.12.75 కోట్లు
1వ రోజు (జులై24న): రూ. 34.75 కోట్లు
2వ రోజు: రూ. 8 కోట్లు
3వ రోజు: రూ. 9.15 కోట్లు
4వ రోజు: రూ. 10.6 కోట్లు
5వ రోజు: రూ. 2.1 కోట్లు
6వ రోజు : రూ. 1.75 కోట్లు
7వ రోజు : రూ. 1.2 కోట్లు