కిస్నా షోరూమ్​ స్టార్ట్​

కిస్నా షోరూమ్​ స్టార్ట్​

హైదరాబాద్, వెలుగు: హరికృష్ణ గ్రూప్‌కు చెందిన  జ్యువెలరీ బ్రాండ్ కిస్నా హైదరాబాద్‌‌లో షోరూమ్​ను ఆరంభించింది. ఇనార్బిట్ మాల్లో కంపెనీ 13వ స్టోర్ ​ప్రారంభోత్సవం సంస్థ  ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్  ఘనశ్యామ్ ధోలాకియా,  కిస్నా డైరెక్టర్ పరాగ్ షా సమక్షంలో జరిగింది. తాము కిస్నా  బ్రాండ్​ పేరుతో 2005 నుంచి నగలను అమ్ముతున్నామని తెలిపారు.

స్టోర్ల సంఖ్యను 3,500 లకు పెంచుతామని చెప్పారు. కిస్నా ఇప్పటికే సిలిగురి, హైదరాబాద్, హిసార్, అయోధ్య, బరేలీ, రాయ్‌‌పూర్, ద్వారక,  ఢిల్లీ, ముంబై, జమ్ము, బెంగళూరు, ఢిల్లీ  ఘజియాబాద్ తదితర చోట్ల షోరూమ్‌‌లను నిర్వహిస్తోంది.