ఏపీ గవర్నర్‌‌‌‌గా నేడు హరిచందన్‌‌‌‌ ప్రమాణం

ఏపీ గవర్నర్‌‌‌‌గా నేడు హరిచందన్‌‌‌‌ ప్రమాణం

అమరావతి, వెలుగు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ లో విశ్వభూషణ్ తో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయిస్తారు. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. 461 మందికి మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

మంగళవారం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి కుటుంబసమేతంగా విశ్వభూషణ్ తిరుపతి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని, తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ చేరుకున్నారు. సీఎం జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆయనకు స్వాగతం పలికారు.