Virat Kohli vs Haris Rauf: విరాట్ కొట్టిన సిక్స్.. నన్ను బాధించింది

Virat Kohli vs Haris Rauf: విరాట్ కొట్టిన సిక్స్.. నన్ను బాధించింది

2022 టీ20 ప్రపంచకప్ లో జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను విరాట్.. తన విద్వంసకర బ్యాటింగ్ తో గెలిపించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో 53 బంతుల్లో 82 పరుగులు చేసిన విరాట్, 19వ ఓవర్లో హరీస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన స్ట్రెయిట్ సిక్స్ అందరికీ గుర్తుండి ఉంటుంది. పాకిస్థాన్ ప్రముఖ టీవీ షో ‘హస్నా మనా హై’లో ఆ సిక్స్ గురించి మాట్లాడిన హరీస్... కోహ్లి గురించి ఇలా అన్నాడు.

‘భుజాల మీదికి వచ్చిన షార్ట్ లెంథ్ బాల్ ని బ్యాక్ ఫుట్ కి వెళ్లి స్ట్రెయిట్ సిక్స్ కొట్టడం ఒక్క కోహ్లికే సాధ్యం అవుతుంది. అలాంటి షాట్లు చాలా అరుదు. మళ్లీ మళ్లీ చూడలేం. ఆ టైమింగ్ కి పర్ఫెట్ షాట్ తాకి సిక్స్ వెళ్లింది. ఓడిపోతున్నాం... అన్నప్పుడు చాలా బాధేసింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కోహ్లి ఎలాంటి స్థాయి ఆటగాడో తెలుసు. అయినా ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయా’ అని అన్నాడు.