రేపు నన్నెవరూ కలవొద్దు..బర్త్ డే సందర్భంగా హరీష్ ట్వీట్

రేపు నన్నెవరూ కలవొద్దు..బర్త్ డే సందర్భంగా హరీష్ ట్వీట్

తన పుట్టిన రోజు సందర్బంగా రేపు అందుబాటులో ఉండబోనని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు . ‘తనని విష్ చేసేందుకు వస్తామంటూ ఫోన్లు చేస్తున్న మిత్రులు,శ్రేయోభిలాషులకు అందరికీ కృతజ్ఞతలు. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న హైదరాబాద్ లో గానీ,సిద్దిపేటలో గానీ ఉండటం లేదు. ముందే నిర్ణయించుకున్న కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల దృష్ట్యా దూరంగా ఉండాల్సి వస్తుంది. నాపై మీరు చూపించే ప్రేమను సామాజిక కార్యక్రమాల ద్వారా చూపాలని కోరుకుంటున్నా మీ అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నా‘ అంటూ హరీశ్ ట్వీట్ చేశారు.