జమ్మికుంట, వెలుగు: ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి దేవాలయ ఉత్సవమూర్తులకు చేయించిన వెండి తొడుగులు, వివిధ రకాల ఆభరణాలను కోరెం నర్సింహారెడ్డి జ్ఞాపకార్ధం భార్య శ్రీదేవి, హరీష్ ప్రతాప్ రెడ్డి, హిరేన్ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్చకుడిగా పనిచేసిన శేషం రామాచార్యులు ఆధ్వర్యంలో 7.64 కిలోల 35 రకాల ఆభరణాలు అందించారు సుమారు 21 లక్షల విలువ ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ ఇంగిలె రామారావు , ఆలయ కార్య నిర్వహణ అధికారి సుధాకర్ తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
