ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు

ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు

టీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు దేశంలో ధరలు పెంచి..తమ స్వార్థ రాజకీయాల కోసం మత కల్లోలాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఏ రంగంలో చూసినా కేంద్ర వైఫల్యాలే కనిపిస్తున్నాయన్నారు. ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిందన్నారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని చెప్పిన మోడీ..అధికారంలోకి వచ్చాక నల్ల చట్టాలను తెచ్చారని మండిపడ్డారు.రైతుల ఆదాయం డబుల్ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం..ఎరువుల ధరలు పెంచి పెట్టుబడి రెట్టింపు చేసిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ..ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఆందోళన  వ్యక్తం చేశారు. బుల్లెట్ రైళ్లు తీసుకొస్తామని ప్రగల్బాలు పలికిన కేంద్ర ప్రభుత్వం..రైళ్లు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ రేటు పెరిగిందని..ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్నారు. పేదలు మరింత పేదలుగా మారిపోయారని..కానీ కార్పొరేట్ కంపెనీల  కోసం 11 లక్షల కోట్లను కేంద్రం మాఫీ చేసిందని చెప్పారు. తెలంగాణ పండించిన యాసంగి వడ్లను కొనుగోలు చేయకుండా అన్నదాతలను అన్యాయం చేసిందని ఆరోపించారు హరీష్ రావు.