
సిద్దిపేట : తొగుట టౌన్ లో మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించార మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదొద్దీన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా చెరుకు ముత్యం రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
ముత్యంరెడ్డి ఇక లేరు అనే నిజం ఉమ్మడి మెదక్ జిల్లాకు, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని హరీష్ రావు అన్నారు. ముత్యంరెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి బుధవారం ఉదయం 8 గంటలకు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు. ముత్యంరెడ్డి మొదటి కుమార్తె అమెరికాలో ఉండడం వల్ల కొంత ఆలస్యం అవుతోందని… ఎల్లుండి వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామ సర్పంచి నుండి రాష్ట్ర మంత్రి వరకు అంచెలంచెలుగా ముత్యంరెడ్డి ఎదిగారనీ.. వివిధ స్థాయిల్లో వారి సేవలు మరువలేనివని చెప్పారు. ఎంతపెద్ద పదవి ఉన్నా అంకిత భావంతో వ్యవసాయం చేసే గొప్ప ప్రజాప్రతినిధి ఆయన అన్నారు హరీష్ రావు.