
టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కు అభినందనలు తెలియజేశారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలిపారు హరీష్ రావు. కేంద్ర మంత్రిగా గతంలో సేవలందించి.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా దత్తాత్రేయ నియమితులు కావడం సంతోషంగా ఉందన్నారు.
Congratulations to Smt @DrTamilisaiBJP ji on her appointment as the new Governor of Telangana
— Harish Rao Thanneeru (@trsharish) September 1, 2019
Congratulations to Sri @Dattatreya
garu on being appointed as the Governor of Himachal Pradesh pic.twitter.com/OnGVo25rPY— Harish Rao Thanneeru (@trsharish) September 1, 2019