యూపీ, బీహార్ ఆందోళనల వెనుక యోగి, నితీష్ కుమార్ ఉన్నరా..? 

యూపీ, బీహార్ ఆందోళనల వెనుక యోగి, నితీష్ కుమార్ ఉన్నరా..? 

నిజామాబాద్: అగ్నిపథ్ పథకంపై కేంద్రం వైఖరిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. వేల్పూర్ మండలం మోతెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన. అగ్నిపథ్ స్కీం యువతకు అర్థం కాలేదని కేంద్రం అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం కారణంగా దేశం అట్టుడుకోందని, బీజేపీ ప్రతి ప్రతి ఒక్కరి ఉసురుపోసుకుంటోందని హరీష్ రావు మండిపడ్డారు. మోడీ సర్కారు ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అగ్నిపథ్ పేరుతో కేంద్రం ఆర్మీని ప్రైవేటుపరం చేసి.. సైనిక ఉద్యోగాలను కాంట్రాక్టు జాబ్ లుగా మార్చే కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన పిల్లలను కాల్చిచంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సికింద్రాబాద్ లో విధ్వంసంవెనుక టీఆర్ఎస్ పార్టీ ఉందన్న బండి సంజయ్ ఆరోపణలపై హరీష్ స్పందించారు. సికింద్రాబాద్ లో దాడులు టీఆర్ఎస్ చేయిస్తే.. యూపీ, బీహార్ లో జరిగిన ఆందోళనల వెనుక యోగి, నితీష్ కుమార్ ఉన్నారా అని ప్రశ్నించారు.