
బాలవికాస్ సేవలను ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధి చేస్తుందని అన్నారు మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరా గ్రామంలో… 35కోట్ల వ్యయంతో 20ఎకరాల్లో బాలవికాస్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ప్రారంభించిన హరీష్ రావు మాట్లాడుతూ… బాల వికాస్ సేవలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. బాలక్క విదేశీయున్ని పెండ్లి చేసుకొని ఇండియాలో సేవా కార్యక్రమాలు చేయడం గ్రేట్ అని అన్నారు. సోషల్ ఈక్విప్ సెంటర్ ను లాభాలు లేకుండా ప్రారంభించడం బాల వికాస్ కే సాధ్యమయిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో సామాజిక సమస్యల పరిష్కారం కోసం బాలవికాస్ కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ కావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఎర్రవెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలో సేవలు అందించడంలో బాలవికాస్ నెంబర్ వన్ అని అన్నారు. బాలవికాస్ స్పూర్తిగానే గోదావరి నీళ్లను సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్నరని చెప్పారు. తాగునీళ్లు అందించడంలో, మహిళా గ్రూప్ లు ఏర్పాటు చేయడంలో కూడా బాలవికాస్ స్పూర్తి అని తెలిపారు.
వినోద్ కుమార్ మాట్లాడుతూ… సమాజంలో మార్పు కోసం బాల వికాస్ తపన పడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బాల దంపతులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. సమాజంలో రుగ్మతలను దూరం చేయడానికి బాల వికాస్ చేస్తున్న కృషి చాలా గొప్పదని అన్నారు.