ఆసిఫాబాద్ ప్రజలకు మెరుగైన వైద్యం : హరీష్ రావు

ఆసిఫాబాద్ ప్రజలకు మెరుగైన వైద్యం : హరీష్ రావు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు గాంధీ, ఉస్మానియా స్థాయి  వైద్యం అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆసిఫాబాద్లో 300 పడకల జిల్లా ఆస్పత్రితో పాటు రేడియాలజీ ల్యాబ్ ఏర్పాటుకు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆసిఫాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావని, వానాకాలం వస్తే డయేరియా, అంటు రోగాలు ప్రబలేవని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలు అందిలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ లో త్వరలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. 7చోట్ల సబ్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంతో పాటు రోడ్లు వేసేందుకు సీఎం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. 60ఏళ్ల పాలనలో తెలంగాణలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17కు పెరిగాయని చెప్పారు. గూడెంలు, తండాలను పంచాయతీలుగా మార్చడం వల్ల 3,146 మంది గిరిజనులు సర్పంచులుగా పాలనలో భాగస్వాములయ్యారని అన్నారు.