బాధపడొద్దు .. భవిష్యత్తులో మళ్లీ అధికారం బీఆర్ఎస్​దే : హరీశ్​

బాధపడొద్దు .. భవిష్యత్తులో మళ్లీ అధికారం బీఆర్ఎస్​దే : హరీశ్​

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఓడిపోయామని, అందుకు బాధ పడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇది స్పీడ్​ బ్రేకర్ ​మాత్రమేనని, భవిష్యత్తులో మళ్లీ అధికారం బీఆర్ఎస్​దేనన్నారు. గురువారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన మహబూబాబాద్​లోక్​సభ ఎన్నిక సన్నద్ధత సమావేశంలో హరీశ్​రావు పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలని కేసీఆర్ ఎంతో ​కృషి చేశారని చెప్పారు.

ఒక్క మహబూబాబాద్​​ పార్లమెంట్ ​పరిధిలోనే 4 మెడికల్ ​కాలేజీలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్​ గోబెల్స్​ ప్రచారం చేసిందని.. వాటిని ప్రజలు నమ్మారన్నారు. లోక్​సభ ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. నెల రోజులైతే కేసీఆర్.. ​తెలంగాణ భవన్​కు వస్తారని, అందరం అక్కడే అందుబాటులో ఉంటామన్నారు. బీఆర్ఎస్​ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అని, గెలుపోటములు మనకు కొత్త కాదన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదన్నారు. కాంగ్రెస్​ నేతలకు హామీలు అమలు చేయడం చేతకాక కాళేశ్వరం

విద్యుత్​ రంగంలో అవినీతి అంటూ గోబెల్స్​ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలను కాపాడేందుకు ట్రస్ట్​ ఏర్పాటు చేస్తామని, అవసరమైన వారి పిల్లలకు సహాయం అందిస్తామన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే లీగల్​సెల్​నుంచి సాయం అందిస్తామన్నారు. జిల్లా ఆఫీసుల్లోనూ లీగల్ ​సెల్​ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.

కాంగ్రెస్​లో కుమ్ములాటలు మొదలైనయ్ ​: కడియం

కాంగ్రెస్​ ప్రభుత్వంలో అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. పొంగులేటి తానే నంబర్​2 అంటున్నారని, భట్టి సీఎం కాలేదని ఆయన భార్య వాపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే ఓడిపోయామని, 2028 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్నారు. కేటీఆర్, హరీశ్​రావు కృష్ణార్జులని, వారిద్దరు కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని

కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. లోక్​సభ​ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ​సూచించారు. వైఎస్సార్, చంద్రబాబును ఎదుర్కొన్న బీఆర్ఎస్​కు రేవంత్​ను ఎదుర్కోవడం లెక్కకాదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి అన్నారు.