
సిద్దిపేట పట్టణంలో ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా సిద్ధిపేటలోని జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ సూచించిన మార్గంలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఒదిగిపోయారనీ…ఆయన వర్ధంతి సందర్భంగా తెలంగాణ సమాజం నివాళులు అర్పిస్తోందని చెప్పారు హరీష్ రావు.