ఉద్యోగుల డీఏలపై హరీశ్ కు భట్టి కౌంటర్

ఉద్యోగుల డీఏలపై హరీశ్ కు భట్టి కౌంటర్

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగుల డీఏలపై అసెంబ్లీలో హరీశ్ రావు  ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క కౌంటర్ ఇచ్చారు.  గత ప్రభుత్వం డీఏ ఇవ్వకపోవడంతోనే సమస్యలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు డీఏలు చెల్లించామని చెప్పారు. ఐదు డీఏల్లో మూడు డీఏలు బీఆర్ఎస్ పెండింగ్ పెట్టినవేనని చెప్పారు.

 ఆర్థిక భారం తగ్గించుకునేందుకు బీఆర్ఎస్ రిటైర్మెంట్ ఏజ్ ను పెంచిందన్నారు భట్టి. 17 వేల మంది 2024 తర్వాత పదవి విరణ పొందారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన బీఆర్ఎస్ 44 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందన్నారు. గత బీఆర్ఎస్  సర్కార్  15 వ తేదీ వరకు జీతాలివ్వలే..తాము వచ్చాక ప్రతి నెల ఫస్ట్ కే జీతాలిస్తున్నామని తెలిపారు.  ప్రతి నెలా 700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి ప్రతి  నెల రూ.1000 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం క్యాష్ లెస్ హెల్త్ స్కీం తీసుకొచ్చామని చెప్పారు.  బీఆర్ఎస్ పదేళ్లలో అన్ని రంగాల్లో  ఆర్థిక విధ్వంసం సృస్టించిందన్నారు భట్టి.  

►ALSO READ | వాహన్ పోర్టల్ ప్రారంభం.. ఇక RTA ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. అంతా ఆన్ లైన్లోనే..

అంతకు ముందు ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు హరీశ్ రావు. రిటైర్డ్ ఉద్యోగులు అనేక తిప్పలు పడుతున్నారని చెప్పారు.  రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎప్పటి వరకు చెల్లిస్తారని ప్రశ్నించారు.  ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్  ఉన్నాయన్నారు.