సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు

దుబ్బాక: సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. బుధవారం ఆయన దుబ్బాకలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్..దుబ్బాక ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానన్న మంత్రి..సిద్దిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

దుబ్బాక మహిళల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని..త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. దుబ్బాక అంటే సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానమని..దుబ్బాక అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.35 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు మంత్రి హరీష్.