ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీలో కలపొద్దు: హరీశ్ రావు

ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీలో కలపొద్దు:  హరీశ్ రావు

ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్టు పరిధిలోకి  వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.  గతంలో కూడా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదన వస్తే..కేసీఆర్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు.  ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏపీ, తెలంగాణల నీటి వాటా తేలకుండా కేఆర్ఎంబీ పరిధిలో కలిపితే తర్వాత అడుక్క తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కృష్ణా జలాల్లో ఇంకా నీటి వాటా తేలలేదన్నారు. నీటి వాటాలు తేలకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు

 శ్రీశైలం  కేఆర్ఎంబీలోకి పోతే హైడల్ పవర్ ఉత్పత్తిపై హక్కులు కోల్పోతామన్నారు     హరీశ్ రావు .  సాగర్ కింద లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేమన్నారు.  ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే కొత్త ప్రాజెక్టుల అనుమతులకు తీవ్ర ఇబ్బంది వస్తుందన్నారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రాకు అప్పగించాయన్నారు. ప్రభుత్వం మేల్కొని తెలంగాణలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.

 మేడిగడ్డ రిపేర్ లో ఉన్నా గోదావరిలో ఉన్న నీళ్లన లిప్ట్ చసే ప్రయత్నం చేయాలన్నారు.నీళ్ళు లిఫ్ట్ చేసి ఎస్సారెస్పీ, ఇతర రిజర్వాయర్ లు నింపాలని సూచించారు. తాము కట్టిన ప్రాజెక్టులో  తాము తెచ్చిన నీళ్లను విడుదల చేయాలన్నారు.  కాళేశ్వరం మోటార్లను  ఆన్ ఆఫ్ పద్దతితో నడిపితే మోటార్ల సామర్థ్యం తగ్గుతుందని చెప్పారు. అలా కాకుండా  రెండు మోటార్లు కంటిన్యూగా నడపాలని సూచించారు. లేదంటే మోటార్లు పాడవుతాయన్నారు. 

రాజకీయాలు మాట్లాడేందుకు చాలా సమయం ఉందన్నారు హరీశ్. రివ్యూలు పెట్టి గత ప్రభుత్వంపై బురద జల్లడం, విచారరణ  అని లీక్ లతోనే కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు.