బీజేపీ డకౌట్..కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ సెంచరీ: హరీశ్ రావు

బీజేపీ డకౌట్..కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ సెంచరీ: హరీశ్ రావు

కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటుందని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. ఆదిలాబాద్ లో ఎన్నికల ప్రచారం  చేసిన హరీశ్.. కాంగ్రెస్ కు అభ్యర్థులు లేక.. టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఎంతకు అమ్ముకుంటున్నారో  వాళ్ల పార్టీ నేతలే లెక్కలతో  సహా బయటపెడుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ టికెట్ ను ఎంతకు అమ్ముకున్నారో ప్రజలకు కూడా తెలుసన్నారు. ఇవాళ టికెట్లను అమ్ముకున్న కాంగ్రెస్సోళ్లు..రేపు తెలంగాణను అమ్ముకుంటారని ఆరోపించారు.  టికెట్లు అమ్ముకునే వారి చేతిలో రాష్ట్రం పెడతారా? అభివృద్ధి చేసే కేసీఆర్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

 ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. ఈ సారి బీజేపీ డకౌట్..కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చాయని ఈ సారి వంద సీట్లు పక్కా  అని ధీమా వ్యక్తం చేశారు హరీశ్..  ఓటుకు నోటు దొంగలను నమ్మొద్దన్నారు.  సీఎం కేసీఆర్ గెలిచాక పెన్షన్ 2 వేలకు పెంచుకున్నామని.. ఈ సారి గెలిస్తే పెన్షన్ ఐదు వేలకు పెంచుతామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఎవరు సీఎం అయితారో వాళ్లకే తెల్వదన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్  సీఎం అవుతారని చెప్పారు. కాంగ్రెస్,బీజేపీలు  అన్నింటికి ఢిల్లీపై ఆధారపడుతారన్నారు. 

కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్  అక్కడ 5 గంటల విద్యుత్ కూడా ఇవ్వలేకపోతుందన్నారు హరీశ్ రావు.  కాంగ్రెస్ కు ఓటెయ్యొద్దని  కర్ణాటక రైతులు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ కు ఓటేసి ఆగం కావొదన్నారు.

ALSO READ : ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలి : ఆకునూరి మురళి