ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఫ్రీగా డయాలసిస్ సేవలు

ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఫ్రీగా డయాలసిస్ సేవలు

కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఫ్రీగా డయాలసిస్ సేవలందించాలని ఆదేశించారు హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు కేంద్రాల్లో ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఐదు బెడ్ల చొప్పున కేటాయించి.. డయాలసిస్ సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలిసిస్ కేంద్రాల్లో 10 వేల మంది రోగులకు సేవలు అందుతున్నాయని చెప్పారు హరీశ్.