నాదర్‌‌‌‌‌‌‌‌గుల్‌‌‌‌ భూముల్లో 7 వేల కోట్ల స్కామ్‌‌‌‌: హరీశ్ రావు

నాదర్‌‌‌‌‌‌‌‌గుల్‌‌‌‌ భూముల్లో  7 వేల కోట్ల స్కామ్‌‌‌‌: హరీశ్ రావు
  •  
  • దళితుల భూములను గద్దల్లా తన్నుకుపోతున్నరు: హరీశ్‌‌‌‌రావు
  • 373 ఎకరాల్లో ఇండస్ట్రీలు, కబ్జాల రూపంలో ప్రభుత్వ పెద్దల కుంభకోణం 
  • ఇందులోనూ మంత్రి పొంగులేటికి ప్రమేయం ఉందని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాల వారి భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఒకవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నదని అన్నారు.  నాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుల్‌‌‌‌‌‌‌‌లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119) లో ఉన్న 373 ఎకరాల భూమిలో 7 వేల కోట్ల రూపాయల భారీ స్కామ్‌‌‌‌‌‌‌‌ జరుగుతున్నదని తెలిపారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఉన్నారని, రక్షకులే భక్షకులుగా మారారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ రోజు వాళ్లను భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలు, పోలీసులతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుల్‌‌‌‌‌‌‌‌ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెప్తే.. 2005లోనే అప్పటి ఆర్డీవో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారని గుర్తు చేశారు. “2017లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వానిదేనని చెప్పింది. రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదు. కానీ 2016లో శివరాజ్ బహదూర్ ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ అనే కంపెనీలకు విక్రయించాడు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదు. ఈ విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్డీవో తేల్చిచెప్పారు. ఆర్డీవో నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్లగా.. ఆర్డీవో నిర్ణయమే సరైనదని, ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్‌‌‌‌‌‌‌‌లు 2022 లో స్పష్టం చేశాయి. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీస్కోవాలని కోర్టు చెప్పింది. మంగళవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది. భూభారతి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో చూసినా ఇది ప్రభుత్వ భూమి ప్రొహిబిటెడ్ ల్యాండ్ గానే చూపిస్తున్నది” అని  పేర్కొన్నారు. 

చెరువు ఫీడర్ చానల్స్ ధ్వంసం 

373 ఎకరాల్లో 17 ఎకరాల లచ్చమ్మకుంట ఎఫ్టీఎల్, 6 ఎకరాల బఫర్ జోన్ ఉందని, ఆ చెరువుకు వచ్చే ఫీడర్ చానల్స్‌‌‌‌‌‌‌‌ను ఈ కంపెనీలు ధ్వంసం చేశాయని హరీశ్ ఆరోపించారు. లచ్చమ్మ కుంట నిండితే అక్కడి నుంచి నాన్ చెరువు, మర్రివానికుంట, రెడ్డి కుంట, సున్నం చెరువు, ఇంజాపూర్ మాసం చెరువుదాకా నీళ్లు వెళ్తాయని, ఇంత జరుగుతున్నా హైడ్రాకు  తెలియట్లేదా అని ప్రశ్నించారు. హైడ్రా రంగనాథ్ చర్యలు తీస్కోకపోతే.. ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అక్కడికి వెళ్తామన్నారు. అక్కడున్న 80 నుంచి 100 ఎకరాల గుట్టల్లో.. 12 ఎకరాలు లింగమయ్య గుట్ట మినహా మిగతాదంతా మింగేశారని, హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.