యూత్.. మద్యాన్ని దూరం పెట్టాలి – వ్యవసాయానికి దగ్గరవ్వాలి

యూత్.. మద్యాన్ని దూరం పెట్టాలి – వ్యవసాయానికి దగ్గరవ్వాలి

హరీష్ రావు ఆసక్తికరమైన కామెంట్స్

సిద్దిపేట : సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో రజక సామూహిక భవనాన్ని, గౌడ్ సంఘం భవనాన్ని, భాల వికాస్ వాటర్ ప్లాంట్ సహా.. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. శాసనసభ ఎన్నికల లో ఈ గ్రామానికి వచ్చి ప్రచారం చేయకపోయిన భారీగా మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల ముందుకు వచ్చి జిమ్మిక్కలు చేయడం కాదు, ఎన్నికల తర్వాత ప్రజలకు సేవ చేయడం గొప్పతనం అన్నారు. త్వరలోనే ముదిరాజ్ ల కోసం చేపల చెరువును ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేస్తామన్నారు. వచ్చే కొద్దీ రోజులో మరో విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. కల్తీకల్లు, కల్తీ మందు తాగకుండా ప్రభుత్వం ఇచ్చే తాడిచెట్ల కళ్ళు తాగి, కిడ్నీలను, ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.

యువత గల్లీల్లో తిరగకుండా లైబ్రరీలో కూర్చుని తమ జీవితాన్ని మార్చుకోవాలని సూచించారు హరీష్ రావు. గతంలో బీడీలు, సిగరెట్ ఎలా ఐతే బానిసలు అయ్యారో ఇప్పుడు యువత మొబైల్ ఫోన్లులకు, మహిళలు టీవీ సీరియల్ బానిసలు అయ్యారున్నారు. టెక్నాలజీకి మనం బానిసలం కావద్దు… టెక్నాలజీ మనకు బానిస కావాలన్న హరీష్ రావు..  వ్యవసాయానికి, తల్లిదండ్రులుకు టెక్నాలజీ ఉపయోగ పడాలన్నారు. ఇంటిలో ఏ చిన్న శుభకార్యమైనా యువత మద్యానికి బానిసలు అవుతున్నారనీ.. యువత మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు హరీష్ రావు.

గ్రామాల్లో రైతులు వరి పంట పండిస్తూ లేజీ క్రాప్ పంటలు పండిస్తున్నారు కానీ.. యువత వరి పంట కాకుండా కూరగాయలు పండించి డబ్బులు సంపాదించుకోవాలని కోరారు హరీష్ రావు. యువత వ్యవసాయానికి దగ్గర కావాలని… కోరితే ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానని హరీష్ రావు చెప్పారు.

ఇర్కోడులో నెల రోజులలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. రానున్న రోజుల్లో స్మశాన వాటిక, పశువుల ఆసుపత్రి, వైకుంఠ రథం మంజూరు చేస్తామనీ… మల్లన్నగుట్టను, దర్గాను అభివృద్ధి చేస్తామన్నారు.