రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బండకట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్త : హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బండకట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్త : హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు
  •     నీళ్లులేక పైకి తేలితే కాళేశ్వరం కూలినట్టు: హరీశ్​రావు
  •     మక్క రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​

సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం కూలిందంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి సిద్దిపేటకు వస్తే.. బండ కట్టి ఆయన్ను రంగనాయక సాగర్​లో ఎత్తేస్తానని.. నీళ్లుండి మునిగిపోతే కాళేశ్వరం ఉన్నట్టు.. తేలితే కాళేశ్వరం కూలినట్టని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలం అల్లీపూర్ లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలన్నారు. 

తమది రైతు ప్రభుత్వమని చెబుతున్న సీఎం, మంత్రులు.. ధాన్యం సేకరించి 50 రోజులు గడుస్తున్నా రైతులకు డబ్బులు వేయడం లేదన్నారు. మక్క రైతులకు బకాయిపడ్డ రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది నుంచి భూమి సాగుచేస్తేనే రైతుబంధు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. 

మరోవైపు రామంచ గ్రామ సర్పంచ్​గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రభవాని నవీన్ గ్రామస్తులతో కలిసి హరీశరావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ నంగునూర్ మండలం ఖాతా గ్రామం, సంతోష్ నగర్, సిద్దిపేట అర్బన్ మండలంలోని బొగ్గులోని బండ, చిన్న కోడూరు మండలంలో రామంచ గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసి చక్కటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

సభ నిర్వహణలో విఫలమయ్యారంటూ స్పీకర్‌‌‌‌‌‌‌‌కు హరీశ్‌‌‌‌ లేఖ

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్​ ప్రసాద్​ కుమార్ చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళనకరమని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, స్పీకర్​పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను దెబ్బతీయడమేనని తెలిపారు. 

న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అసెంబ్లీ సభా వ్యవహారాలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆదివారం ఆయన స్పీకర్​కు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేశారని, సభ నిర్వహణలో స్పీకర్ విఫలమయ్యారని విమర్శించారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాల్సి ఉన్నా.. అది జరగడం లేదని హరీశ్ రావు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధానమైన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలోనూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.