ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు ఉపసంహరించుకోండి: ఏపీ సర్కార్ ను కోరుతూ హరీష్ రావు ట్వీట్

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు ఉపసంహరించుకోండి: ఏపీ సర్కార్ ను కోరుతూ హరీష్ రావు ట్వీట్

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సీఎం చంద్రబాబు, జగన్ లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేసులు నమోదు చేసేవరకు వెళ్ళింది వ్యవహారం. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని ఏపీ సర్కార్ ను కోరుతూ ట్వీట్ చేశారు హరీష్ రావు.

బీజేపీకి చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో అమిత్ షా అన్నారని.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సమావేశంలో అన్నారంటూ ఓ ఛానల్ డిబేట్ లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పలు చోట్ల నాగేశ్వర్ రావుపై కేసులు కూడా నమోదయ్యాయి. 

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదని...వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు.

►ALSO READ | రైల్వే ప్లాట్ ఫామ్ పై మహిళ ప్రసవం... ఫోన్ చేసినా స్పందించని 108 సర్వీస్