వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై ఓ మహిళ ప్రసవించిన సంఘటన ఆదివారం ( మే 24 ) ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... తాండూర్ మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన మహిళ కుడిటినోప్పులతో గత వారం క్రితం తాండూరు జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది. సదరు మహిళకు ఫిట్స్ రావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాదుకు తరలించారు.
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ శనివారం రాత్రి తాండూరు రైల్వే స్టేషన్ చేరుకుంది. శనివారం రాత్రి నుండి తాండూరు రైల్వే స్టేషన్ లోనే ఒంటరిగా ఉన్న మహిళకు ఉన్నట్టుండి పురిటి నొప్పులు రావడంతో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పైనే పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చింది.
సంఘటన గమనించిన తోటి ప్రయాణికులు 108 వాహనానికి ఫోన్ చేసిన కూడా సుమారు రెండు గంటల వరకు స్పందించలేదని... దీంతో తాండూర్ కు చెందిన ముస్తఫా తన ఆటోలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో తల్లి బిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి చేర్పించారు. అత్యవసర పరిస్థితులలో అర్ధరాత్రి రెండు గంటలకు 108కు ఫోన్ చేసిన కూడా స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేశారు.
