
చెన్నైలో గురువారం జరిగిన ఐపీఎల్ 2021 వేలంపాటలో కడప యువ క్రికెట్ ప్లేయర్ స్థానం దక్కించుకున్నాడు. చిన్నమండెం మండలం నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెటర్ హరిశంకర్ రెడ్డిని సీఎస్‌కే జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది. హరిశంకర్ రెడ్డి డిగ్రీ చదివాడు. ప్రస్తుతం బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. అండర్-19లో రాష్ట్ర జట్టుకు ఎంపియ్యాడు. 2016 నుంచి ఆడడం మొదలు పెట్టాడు. తర్వాత రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు. తమ కుమారుడు ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి తో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.