బ్లాక్ లిస్ట్ లో ఆ నాలుగు పత్రికలు

బ్లాక్ లిస్ట్ లో ఆ నాలుగు పత్రికలు
  • ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ నిర్ణయం
  • తమపై తప్పుడు కథనాలు రాసినందుకేనని స్పష్టం

లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ నాలుగు బ్రిటిష్ టాబ్లాయిడ్లను బ్లాక్ లిస్ట్ చేశారు. తమపై తప్పడు కథనాలు, గాసిప్స్ రాశారని ఆరోపించారు. ఈమేరకు సన్, డైలీ మెయిల్, మిర్రర్, డైలీ ఎక్స్ ప్రెస్ ఎడిటర్లకు లేఖ రాశారు. ఇకపై ఈ పత్రికలకు సహకరించబోమని, వారితో ఎలాంటి సమాచారం షేర్ చేసుకోబోమని స్పష్టం చేసినట్లు యూకే మీడియా వెల్లడించింది. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ నుంచి డివైడ్ అయిన ఈ కపుల్ ఈ నాలుగు పత్రికలతో కలిసి పనిచేయబోమని చెప్పినట్లు తెలిపింది.
‘‘మీడియా విమర్శలు చేస్తోందనో, రిపోర్టింగ్ ను సెన్సార్ చేసేందుకో తామిలా చేయలేదు. కానీ వాస్తవాలను వక్రీకరించడం, తప్పుడు కథనాలను ప్రచురించడం సరికాదు. గాసిప్స్ రాయడం.. సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందే తప్ప.. ఎవరకీ ఉపయోగం ఉండదు. అందుకే తాము నాలుగు పత్రికలతో ఎలాంటి సమాచార మార్పిడి చేసుకోబోము. ఈ విధానం అన్ని మీడియాలకు వర్తించదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులతో కలిసి పనిచేయడం కొనసాగుతుంది”అని ఈ జంట చెప్పినట్లు యూకే మీడియా పేర్కొంది.