
ఐసీసీ లేటెస్ట్ టెస్ట్ ర్యాంకింగ్స్ ను బుధవారం (జూలై 9) ప్రకటించింది. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. సహచరుడు రూట్ ను వెనక్కి నెట్టి 886 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. రూట్ కంటే బ్రూక్ 18 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. బ్రూక్ నెంబర్ వన్ కు చేరడంతో రూట్ (868) రెండో స్థానానికి పడిపోయాడు. దీంతో ఆరు నెలల పాటు అగ్రస్థానంలో ఉన్న రూట్ ప్రస్థానం ముగిసింది. టీమిండియాపై ఇటీవలే ముగిసిన ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన బ్రూక్.. టాప్ కు దూసుకొచ్చాడు.
Harry Brook is the No.1 ranked Test batter in the world 🔝
— ESPNcricinfo (@ESPNcricinfo) July 9, 2025
He reclaims the top spot from Joe Root pic.twitter.com/TqDaJZWUBe
అదే సమయంలో రూట్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ విఫలం కావడం మైనస్ గా మారింది. ఇక టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి టాప్-10 లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి టెస్ట్ తర్వాత 21 స్థానంలో ఉన్న గిల్ (807).. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 430 పరుగులు చేయడంతో ఒక్కసారిగా 15 స్థానాలు ఎగబాకడం విశేషం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక స్థానం దిగజారి 8 వ స్థానానికి చేరుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెరీర్‌లో 858 రేటింగ్ పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు.
Harry Brook reclaims top spot!
— ESPNcricinfo (@ESPNcricinfo) July 9, 2025
Shubman Gill and Jamie Smith have a big rise 📈
🔗 https://t.co/jeSQOBYuVr pic.twitter.com/ddERTMohl9
విలియంసన్ మూడో స్థానంలో.. స్మిత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియాతో తొలి టెస్టులో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన బెన్ డకెట్..టాప్ 10 లో చోటు కోల్పోయి నాలుగు స్థానాలు దిగజారి 12 ర్యాంక్ కు పడిపోయాడు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ఎడ్జ్ బాస్టన్ టెస్టులో అదరగొట్టడంతో 16 స్థానాలు ఎగబాకి 10 వ ర్యాంక్ కు చేరుకున్నాడు. బౌలింగ్ లో బుమ్రా టాప్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు. బుమ్రాను మినహాయిస్తే భారత్, ఇంగ్లాండ్ జట్లలో ఎవరూ కూడా టాప్-10 లో స్థానం సంపాదించుకోలేకపోయారు.