
గుజరాత్ లో మంత్రివర్గం అంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఒక్క రోజులోనే కొత్త మంత్రి వర్గాన్ని ఎన్నకుంది అక్కడి బీజేపీ ప్రభుత్వం. శుక్రవారం (అక్టోబర్ 17) 26 మంది కొత్త మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు హోం మినిస్టర్ గా ఉన్న హర్ష్ సంఘ్వీని డిప్యూటీ సీఎం పదవి వరించింది.
కొత్త మంత్రి వర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవిబా జడేజా స్థానం సంపాదించుకున్నారు. ప్రజల్లో ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఆమెకు మంత్రిగా బాధ్యతలు అప్పగించారు ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్. గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ఆచార్య దేవ్ రత్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రిగా హర్ష్ సంఘ్వీ ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రి వర్గం షఫ్లింగ్ లో భాగంగా రాజీనామా చేసిన మంత్రులలో నలుగురు మంత్రి పదవిని దక్కించుకున్నారు. అందులో రిషికేష్ పటేల్, కనుభాయి దేశాయ్, కున్వర్ జీ బవాలియా, పర్షోత్తం సోలంకి ఉన్నారు. వీరికి మొదటి పోర్ట్ ఫోలియోలే కేటాయించడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరితో పాటు గుజరాత్ లో ప్రముఖ కుటుంబాల నుంచి ప్రఫుల్ పన్సేరియా, సంఘ్వీ కొత్త మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నివాసంలో గురువారం (అక్టోబర్ 16) జరిగిన సమావేశంలో అధిష్టానం సూచన మేరకు ఒక్క ముఖ్యమంత్రి తప్ప మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయించారు. మొత్తం 16 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారు.
ఆ తర్వాత మరుసటి రోజైన శుక్రవారం.. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో మంత్రుల సంఖ్య16 నుంచి 26 కు చేరుకుంది. 182 మంది సభ్యులు ఉండే గుజరాత్ అసెంబ్లీలో గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు.
కొత్త మంత్రుల లిస్టు:
హర్ష్ సంఘ్వీ, రిషికేష్ పటేల్, కనుభాయి దేశాయ్, కున్వర్ జీ బవాలియా, పర్షోత్తం సోలంకి, ప్రఫుల్ పన్సేరియా, రవిబా జడేజా, త్రికం ఛంగా, స్వరూప్ జీ ఠాకోర్, ప్రవీణ్ మాలి, పిసి బరాండా, దర్శన వాఘేలా, కాంతిలాల్ అమృతియా, అర్జున్‌భాయ్ మోద్వాడియా, డాక్టర్ ప్రద్యుమ్న్ వాజా, కౌశిక్ వెకారియా, జితేంద్రభాయ్ వఘని, రమణ్‌భాయ్ సోలంకి, ప్రవీణ్ సింగ్, కమలేష్‌భాయ్ పటేల్ మనీషా వకీల్, ఈశ్వర్‌సింగ్ పటేల్, డాక్టర్ జయరాంభాయ్ గమిత్, నరేష్‌భాయ్ పటేల్