ఫ్యామిలీతో కలిసి నవ్వుకునేలా.. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..

ఫ్యామిలీతో కలిసి నవ్వుకునేలా.. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..

హర్ష చెముడు ప్రధాన పాత్రలో బాబు డేగల రూపొందించిన వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హర్ష మాట్లాడుతూ ‘ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇది. నాలుగు నెలల్లో చాలా కంఫర్టబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ చేశాం. ఫస్ట్ రెండు ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీగా ఇస్తున్నాం.  అవి చూశాక తప్పకుండా సబ్​స్క్రైబ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది.  

త్వరలో సీజన్ 2 కూడా చేస్తాం’ అని చెప్పాడు.  దర్శకుడు బాబు మాట్లాడుతూ ‘ఈటీవీ విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా, అన్ని భాషల్లో వస్తుందని  చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ ఇది’ అని అన్నాడు. 

అందరూ ఎంజాయ్ చేసే ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదని నిర్మాత చవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.  హైపర్ ఆది,   దీపక్, ప్రేమ్ సాగర్, ఐశ్వర్య, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సుహాస్, ఈటీవీ విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.