
ప్రతి నెల పౌర్ణమి... అమావాస్య ఏర్పడుతాయి. అయితే ఈ ఏడాది ( 2025) ఆశ్వయుజమాసంలో అక్టోబర్ 6 వ తేది పౌర్ణమి ఏర్పడుతుంది. అక్టోబర్ 7 వతేది వరకు ఇది కనపడుతుందని శాస్త్రవేత్తలుచెబుతున్నారు.ఈ సమయంలో చంద్రుడు బంగారం, నారింజ రంగులో వెలిగిపోతాడు.. అత్యంత అద్భుతంగా కనిపించే చంద్రుడని ఎలా చూడాలి.. ఎక్కడ చూడాలి.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. . .
ఆశ్వయుజమాసం అక్టోబర్ 6 వతేదీన పౌర్ణమి ఘడియలు మీనరాశిలో ఏర్పడుతాయి. చంద్రుడు .. భూమి.. కక్ష్యకు దగ్గరగా వస్తాడు. చంద్రుని పెరిజీతో సమానంగా ఉండటంతో.. దీనిని హార్వెస్ట్ మూన్ అని పిలుస్తారు.
ఉత్తరార్థగోళంలో శరదృతువు ప్రారంభానికి దగ్గరగా వచ్చే పౌర్ణమిని హార్వెస్ట్ మూన్ అంటారు. ఈ నెల 6 వ తేదీన పౌర్ణమి సమయంలో చందమామ సంపూర్ణంగా కనిపిస్తుంది. ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తుంది. 15 రోజుల పాటూ... చందమామ క్రమంగా తగ్గిపోతూ... ఆ తర్వాత కాంతి పెరుగుతూ... 30 రోజులకు సంపూర్ణ చందమామగా కనిపిస్తుంది. ఆ చందమామ చూసేందుకు చాలా పెద్ద సైజులో ఉన్నట్లు కనిపించడమే కాదు... ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఈసారి అక్టోబర్ 6, తేదీల్లో 7 సంపూర్ణ చందమామ రాబోతోంది...
ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈక్వినాక్స్ సమయంలో వచ్చే పౌర్ణమిని హార్వెస్ట్ మూన్ అని పిలుస్తారు. .. రెగ్యులర్‌గా అక్టోబర్‌లో వచ్చే పౌర్ణమిని హంటర్స్ మూన్ (వేటగాళ్ల మూన్) అని పిలుస్తారు. జ్యోతి ష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 6వ తేది న రాత్రి 10:48 గంటలకు చంద్రుడు తన పౌర్ణమి దశ ప్రారంభం అవుతుంది. గతంలో, హార్వెస్ట్ మూన్ వరి, మొక్కజొన్న, బీన్స్, గుమ్మడికాయ పంటకోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాలను ప్రకాశవంతం చేసేది, దీనివల్ల రైతులు సాయంత్రం పని చేసుకునేవారు.
అక్టోబర్ 6,7 తేదీల్లో ఏర్పడే (పౌర్ణమి ఘడియులు ) హార్వెస్ట్మూన్ చాలా ప్రత్యేకమైనది ఇది సూర్యాస్తమయం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఈ దశలో సూర్యకాంతి క్షితిజ సమాంతరంగా తక్కువగా ఉండటంతో చంద్రుడు బంగారు -రింజ రంగులో కనిపిస్తాడు. భూమి వాతావరణం మందమైన పొర ద్వారా కనిపిస్తుంది.
హార్వెస్ట్ మూన్ ని ఎలా చూడాలి
- కాలుష్యం లేని .. నగరానికి దూరంగా ఉన్న ఓ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి.
- ఆ ప్రదేశంలో లైటింగ్ ఉండేలా చూసుకోవాలి.
- హార్వెస్ట్ మూన్ ను చూసేందుకు బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగించండి.
- DSLR కెమెరాలను ఉపయోగించి ఫొటోలు.. వీడియోలు కూడా చీత్రీకరించవచ్చు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.