మహిళల్లో వీరోచిత లక్షణాల్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పహల్గాం బాధితులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద కామెంట్లు

మహిళల్లో వీరోచిత లక్షణాల్లేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..పహల్గాం బాధితులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద కామెంట్లు

చండీగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పహల్గాం టెర్రరిస్టుల దాడి ఘటనలో భర్తలను కోల్పోయిన మహిళలనుద్దేశించి హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ వివాదాస్పద కామెంట్లు చేశారు. టెర్రరిస్టులను వేడుకునే బదులు మహిళలు పోరాడి ఉండాల్సిందన్నారు. ఆ ధైర్యం లేకపోవడంతోనే వాళ్లు బాధితులయ్యారని అన్నారు. 

టెర్రరిస్టులు గన్ను చూపిస్తే, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర మహిళల ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయారని అన్నారు. మహిళలు అగ్నివీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిక్షణ పొంది ఉంటే ఆ టెర్రరిస్టులు 26 మందిని చంపేవారు కాదని అన్నారు. శనివారం హర్యానాలో జరిగిన అహల్యాబాయి హోల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయంతి వేడుకల్లో ఎంపీ మాట్లాడారు. ‘‘మా సోదరీమణులు వారి భర్తలను కోల్పోయారు. 

టెర్రరిస్టుల బులెట్లకు 26 మంది బలయ్యారు. అక్కడున్న మహిళల్లో ధైర్యం, వీరత్వం లేదు. అందుకే వాళ్లు చేతులు జోడించి టెర్రరిస్టులను వేడుకున్నారు. అదే ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయిలా పోరాడి ఉంటే మృతుల సంఖ్య తగ్గేది. మన సోదరీమణులు కూడా వాళ్లలా ధైర్యంగా బతకాలని కోరుకుంటున్నా”అని ఎంపీ అన్నారు.