తెలంగాణ నిర్మాణంలో హర్యానా ప్రజల కృషి

తెలంగాణ నిర్మాణంలో హర్యానా ప్రజల కృషి

తెలంగాణ నిర్మాణంలో హర్యానా ప్రజల కృషి ఎంతో ఉందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఆదివారం ఆయన సికింద్రాబాద్ లో హర్యానా నాగరిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1600 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఇక్కడ హర్యానా ప్రజలను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 150 సంవత్సరాల క్రితం హర్యానావాసులు వ్యాపారం నిమిత్తం దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లారు. అందులో భాగంగా వారు తెలంగాణలో కూడా స్థిర పడ్డారన్నారు. 

నాటికి నేటికి చాలా తేడా ఉందన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి మీ అందరిని మీ పునాదులు అయినటువంటి హర్యానాతో కలిపి ఉంచినందుకు సంతోషంగా ఉందన్నారు. గత ఎనిమిది సంవత్సరాలలో హర్యానాలో ఎంతో మార్పు వచ్చింది. హర్యానాలో నూతన కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఏ,బి,సి,డి లుగా విభజించి సింగల్ విండో ద్వారా రాయితీలు ఇచ్చి లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ నిర్మాణంలో హర్యానా ప్రజల కృషి ఎంతో ఉందని మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. త్వరలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రాబోతుందని అందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ( పవర్ & హెవీ ఇండస్ట్రీస్ ) కృష్ణ పాల్ గుజ్జర్, హర్యానా సిర్సా ఎంపీ సునీత దుగ్గల్, హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ధంకడ్, బీజేపీ బేగంపేట్ డివిజన్ అద్యక్షుడు మిథున్ జైన్, హర్యానా భవన్ అధ్యక్షులు సురేష్ కుమార్ సింఘాల్, ఉపాధ్యక్షులు రాజేంద్ర కుమార్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి మహేష్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి అనిల్ రతన్ గోయల్, కోశాధికారి సతీష్ బన్సల్ తదితరులతో పాటు హర్యానా ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.