రాహుల్ను కలిసిన హర్యానా కాంగ్రెస్ నేతలు

రాహుల్ను కలిసిన హర్యానా కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీతో హర్యానా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా, రణదీప్ సూర్జేవాలా, కుమారి షెల్జా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రాగా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటోంది. పార్టీలో అంతర్గత గొడవలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తుస్తోంది. అందులో భాగంగా హర్యానా నేతలను పిలిపించుకొని రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి, సంస్థాగ‌త విస్త‌ర‌ణ‌పై చ‌ర్చించారు. తమలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, సమిష్టిగా పని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని రాహుల్ కు చెప్పినట్టు సమావేశం అనంతరం హర్యానా కాంగ్రెస్ నేతలు చెప్పారు. త‌మ ఐడియాల‌ను రాహుల్ ముందు ఉంచామ‌ని, రాహుల్ ప్ర‌తి ఒక్క‌రి అభిప్రాయాలు తెలుసుకున్నార‌ని  హర్యానా పీసీసీ ప్రెసిడెంట్ షెల్జా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

భారత్ లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

ఆలేరులో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర