హర్యాణలో బీజేపీ, కాంగ్రెస్ టఫ్ ఫైట్..

హర్యాణలో బీజేపీ, కాంగ్రెస్ టఫ్ ఫైట్..

హర్యాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.   90స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఇప్పటివరకు బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 43స్థానాలలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 33స్థానాలలో ముందంజలో ఉండి టఫ్ ఫైట్ ఇస్తుంది. అయితే గెలుపు తమేదేనని అంటున్నారు హర్యాణ బీజేపీ శ్రేణులు.

మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది బీజేపీ. 288స్థానాలకు గాను.. 183 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తల హాడావుడి నెలకొంది. నాగ్ పూర్ లో బరిలో ఉన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంలో ఉన్నారు.