చిక్కినట్లే చిక్కి చేజారింది.. ఇండియాలోనే ఖరీదైన నంబర్ ప్లేట్ HR 88B 8888 మళ్లీ వేలానికి.. కారణం ఏంటంటే..

చిక్కినట్లే చిక్కి చేజారింది.. ఇండియాలోనే ఖరీదైన నంబర్ ప్లేట్ HR 88B 8888 మళ్లీ వేలానికి.. కారణం ఏంటంటే..

HR 88B 8888.. ఈ నంబర్ ప్లేట్ గురించి వినే ఉంటారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన నంబర్ ఇది. హర్యానాలో కోటి 17 లక్షలకు అమ్ముడుపోయి వార్తల్లో నిలిచింది. ఖరీదైన కారునే కొనొచ్చు.. నంబర్ ప్లేట్ కు అంత  తగలేశాడేంటా.. అని దేశ వ్యాప్తంగా చర్చకూడా నడిచింది. అంత కాస్ట్లీ నంబర్ ఆ వ్యక్తికి చిక్కినట్లే చిక్కి చేజారింది. ఈ నంబర్ మళ్లీ వేలానికి వచ్చింది. అంత ఇష్టంగా.. అంత డబ్బు పెట్టి తీసుకున్న నంబర్ ను ఎందుకు వదులుకున్నాడా..? ఎలా మిస్సయ్యిందా..? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. 

హర్యానాకు చెందిన సుధీర్ కుమార్ అనే వ్యక్తి.. రొములస్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్. ఈ ఫ్యాన్సీ నంబర్ ను దక్కించుకునేందుకు బిడ్ వేసి.. రెండు రోజుల తర్వాత ఆక్షన్ లో రూ. కోటి 17 లక్షలకు దక్కించుకున్నాడు. దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ గా రికార్డుకెక్కింది. 

మళ్లీ వేలానికి ఎందుకు..?

ఈ నంబర్ ప్లేట్ వేలం పూర్తయ్యాక.. దానికి కావాల్సిన మొత్తం చెల్లించాల్సిన డెడ్ లైన్ 2025, డిసెంబర్ 01వ తేదీ 12 గంటలకు ఉంది. అయితే అప్పటి వరకు ఎమౌంట్ చెల్లించకపోవడంతో నంబర్ ప్లేట్ ను కోల్పోయాడు. డబ్బు చెల్లించేందుకు శనివారం (నవంబర్ 29) రాత్రి వరకు ప్రయత్నించానని.. టెక్నికల్ సమస్యతో ఫెయిల్ అయ్యిందని చెప్పాడు. 

►ALSO READ | షాకింగ్ ఇన్సిడెంట్: పానీ పూరి తింటూ తెరిచిన నోరు తెరిచినట్లే.. డాక్టర్లే చేతులెత్తేసిన ఘటన !

ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పూర్తిగా వ్యతిరేకత వచ్చినట్లు చెప్పాడు. ఫ్యాన్సీ నంబర్ తీసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలిపాడు. కేవలం నంబర్ ప్లేట్ కోసం కోట్లు తగలేయడమేంటని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు. సోమవారం వరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. కానీ ఫ్యామిలీ ఒత్తిడితో డబ్బు చెల్లించకుండా ఉన్నాడు. దీంతో అలాట్ మెంట్ క్యాన్సిల్ చేసి రీ ఆక్షన్ కు నంబర్ ప్లేట్ ను వెబ్ సైట్ లో ఉంచారు హర్యానా ఆర్టీవో అధికారులు. 

హర్యానాలో  బుధవారం ( నవంబర్ 26 ) జరిగిన ఆన్ లైన్ వేలంపాటలో ఒక VIP కార్ నంబర్ కోసం రూ. కోటి 17 లక్షలు వెచ్చించి కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. హర్యానా గవర్నమెంట్ అధికారిక పోర్టల్ fancy.parivahan.gov.in లో ఇవాళ సాయంత్రం జరిగిన బిడ్డింగ్ లో HR88B8888 నంబర్ రికార్డ్ ధర పలికింది. ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన నంబర్ గా నిలిచింది. ఆన్ లైన్ లో జరిగిన ఈ వేలంపాటలో 45 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ నంబర్ బేస్ ధర రూ. 50 వేలు కాగా.. వేలంపాటలో క్రమక్రమంగా పెరుగుతూ రూ. కోటి 17 లక్షల రికార్డ్ ధరకు చేరింది. మధ్యాహ్నం నాటికి రూ. 88 లక్షలకు చేరిన నంబర్ ధర సాయంత్రం అయ్యేసరికి రికార్డ్ ధరకు చేరడంతో అంతా అవాక్కయ్యారు. ఇంతకీ కార్ నంబర్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేసిన ఆ వీఐపీ ఎవరు, ఆ కార్ ఏంటి అన్న వివరాలు తెలియాలి.