షాకింగ్ ఇన్సిడెంట్: పానీ పూరి తింటూ తెరిచిన నోరు తెరిచినట్లే.. డాక్టర్లే చేతులెత్తేసిన ఘటన !

షాకింగ్ ఇన్సిడెంట్: పానీ పూరి తింటూ తెరిచిన నోరు తెరిచినట్లే.. డాక్టర్లే చేతులెత్తేసిన ఘటన !

టైమ్ బాలేనప్పుడు అరటిపండు తిన్నా నోటి పళ్లు విరుగుతాయి అంటుంటారు. అచ్చం అలాంటి ఇన్సిడెంటే ఇది. ఇష్టమైన పానీపూరి తింటుండగా దవడలు పక్కకు జరిగి మహిళ నరక యాతన అనుభవించింది. తెరుచుకున్న నోరు మళ్లీ మూత పడకపోవడంతో నొప్పితో విలవిల లాడింది మహిళ. పానీపూరి దెబ్బకు డాక్టర్ కూడా చేతులెత్తేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. 

యూపీలో పానీ పూరి మెడికల్ ఎమర్జెన్సీకి  కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఔరయా జిల్లాలో ఒక మహిళ పానీపూరి తింటుండగా దవడ పక్కకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తం వైరల్ గా మారింది. పానీ పూరీ లవర్స్ ను ఆందోళనకు గురిచేసింది.

ఇంకిలా దేవి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో దగ్గర్లో ఉన్న క్లినిక్ వెళ్తున్న క్రమంలో.. ఆకలిగా ఉందని పానీ పూరి తిందామని బండి దగ్గర ఆగింది. ఆమెతో పాటు వచ్చిన మహిళ ఎలాంటి ఇబ్బంది లేకుండా గోల్ గప్పాలు తినేసింది. కానీ ఇంకిలా మాత్రం తినడంలో ఇబ్బంది పడింది. పెద్ద పానీ పూరిని నోట్లో పెట్టుకునే క్రమంలో నోటి దవడ పక్కకు జరిగింది. దీంతో తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. నొప్పి భరించలేక ఆమె విలవిలలాడింది. 

చేతులెత్తేసిన డాక్టర్:

నొప్పితో తల్లడిల్లుతున్న మహిళను వెంటనే పక్కనే ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లింది ఆమెతో వచ్చిన మరో  మహిళ. డాక్టర్ కాసేపు ట్రీట్ మెంట్ చేయాలని ప్రయత్నించి.. కేసు క్రిటికల్ గా ఉందని చేతులెత్తేశాడు. మరింత అడ్వాన్స్ డ్ కేర్ అవసరం అని చెప్పడంతో అందరూ స్టన్నయ్యారు. 

►ALSO READ | పెంపుడు కుక్కతో పార్లమెంటులోకి రేణుకా చౌదరి.. ఇది కరవదు.. కరిచేవాళ్లు లోపలే ఉన్నారంటూ సెటైర్లు

ఇలాంటి కండిషన్ ఏ ఒక్కరికీ గతంలో రాలేదని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె దవడను మూసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దవడ పక్కకు జరగడంతో చాలా సెన్సిటివ్ గా మారిందని.. మళ్లీ యధాతథ స్థితికి తీసుకురావాడానికి చాలా శ్రమించాల్సి వస్తోందని తెలిపారు. పానీపూరి ఇండియన్స్ కు చాలా ఇష్టమైన స్నాక్ అయినప్పటికీ.. చాలా జాగ్రత్తగా తినాలని.. పెద్ద పూరీలను తినకపోవడమే మంచిదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.