పెంపుడు కుక్కతో పార్లమెంటులోకి రేణుకా చౌదరి.. ఇది కరవదు.. కరిచేవాళ్లు లోపలే ఉన్నారంటూ సెటైర్లు

పెంపుడు కుక్కతో పార్లమెంటులోకి రేణుకా చౌదరి.. ఇది కరవదు.. కరిచేవాళ్లు లోపలే ఉన్నారంటూ సెటైర్లు

దేశ వ్యాప్తంగా ఫైర్ బ్రాండ్ గా పేరున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సోమవారం (డిసెంబర్ 01) టాక్ ఆఫ్ ద కంట్రీ గా మారారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటుకు పెంపుడు కుక్కను తీసుకురావడం తీవ్ర వివాదాస్పంగా మారింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా విపక్షాలు నిరసన తెలుపుతున్న క్రమంలో.. ఆమె కుక్కతో రావడం చర్చనీయాంశం అయ్యింది. 

రేణుక కుక్కతో రావడంపై కొందరు ఎంపీలు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. రోడ్డుపైన తిరుగుతుండగా కుక్కను తీసుకొచ్చా. దానికి ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమోనని కార్లో తెచ్చా. పార్లమెంటుకు వచ్చా. మళ్లీ కారులో పంపించా. దానికి డిస్కషనేంటి.. అని ప్రశ్నించారు. 

కరిచేవాళ్లు లోపలే ఉన్నారు:

కుక్కతో పార్లమెంటుకు రావద్దని ఏమైనా చట్టం ఉందా..? కారు, స్కూటర్ ఢీకొన్నాయి. రోడ్డుపై కుక్క తిరుగుతోంది.. ఏదైనా వాహనం ఢీకొంటుందని తీసుకొచ్చా.. అంటూనే.. ఈ కుక్క కరవదు.. కరిచే వాళ్లు లోపల చాలా మంది ఉన్నారని పరోక్షంగా బీజేపీ నేతలపై విమర్శలకు దిగారు. 

వాళ్లు ప్రభుత్వం నడుపుతున్నారు. వాళ్లు చేసేది ఏం లేదు. మూగ జీవాల పట్ల మేం కేర్ తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఏ అంశంలోనూ సాధించిన ప్రగతి ఏమీ లేదు. పార్లమెంటులో కూర్చుని మమ్మల్ని ప్రతిరోజూ కరిసే వాళ్ల గురించి మేం మాట్లాడం.. అంటూ చెప్పుకొచ్చారు. 

►ALSO READ | ఈ ఫొటో మీ కంట పడిందా..? వీళ్ల గురించి తెలిస్తే అంత దారుణంగా ట్రోల్ చేసి ఉండరేమో..!

పార్లమెంటుకు కుక్కతో రావడాన్ని బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి జంతువులు అంటే నచ్చదు. ఈ చిన్న ప్రాణి లోపలికి వచ్చినంత మాత్రాన ఏం చేస్తుంది.. అంటూ ప్రశ్నించారు. 

అంతకు ముందు రేణుకా చౌదరి పెంపుడు కుక్కతో పార్లమెంటులోకి రావడాన్ని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తప్పుబట్టారు. పార్లమెంటుకు కొన్ని రూల్స్, నిబంధనలు ఉంటాయని.. వాటిని మిస్ యూజ్ చేయవద్దని మండిపడ్డారు.

అదే విధంగా బీజేపీ స్పోక్స్ పర్సన్ షెహజాద్ పూనావాలా ఈ విషయంలో రేణుకా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటును, ఎంపీలను ఆమె అవమానించారని.. ఆమెనే కుక్కను తెచ్చి.. కరిచేవాళ్లు లోపలున్నారని చెప్పడం ఏంటి.? కాంగ్రెస్ వాళ్ల నిజస్వరూపం ఇదే అంటూ మండిపడ్డారు. 

ఈ వివాదంపై పార్లమెంట్ సెక్యూరిటీ స్పందించింది. ఆమె కుక్కను తీసుకురావడంలో ఎలాంటి నిబంధనల అతిక్రమింపు లేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం.. అనధికార వ్యక్తులు కార్లనుండి దిగకుండా చూసుకోవడమే తమ ప్రోటోకాల్ అని తెలిపారు.