దేశద్రోహులు: పాక్ కి సమాచారం చేరవేస్తున్న హర్యాణా యువకుడి అరెస్ట్.. వారంలోనే మూడోది..

దేశద్రోహులు: పాక్ కి సమాచారం చేరవేస్తున్న హర్యాణా యువకుడి అరెస్ట్.. వారంలోనే మూడోది..

ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆర్మీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు దేశం బయట పాకిస్థాన్ లో దాగి ఉన్న ఉగ్రవాదులకు సహకారం చేస్తున్న పాక్ సానుభూతిపరులు, దేశద్రోహులను పట్టుకునే పనిలో పడ్డారు. దీంతో కేవలం వారం రోజుల్లోనే మూడో అరెస్ట్ జరగటం స్లీపర్ సెల్స్ ఏ స్థాయిలో పనిచేస్తున్నారనే విషయం బయటపడుతోంది. సాధారణ పౌరుల్లా మెరుగుతూ పాక్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిని వెతికి వేటాడే పనిలో ప్రస్తుతం సెక్యూరిటీ అధికారులు ఉన్నారు.

తాజాగా హర్యాణా పోలీసులు 26 ఏళ్ల అర్మన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను పాక్ కోసం దేశంలో గూఢచర్యం చేస్తున్నట్లు నుహ్ పోలీసులు వెల్లడించారు. అతడు భారత ఆర్మీ, ఇత సాయుధ దళాలకు చెందిన సున్నితమైన సమాచారాన్ని వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా పాకిస్థాన్ కి చేరవేస్తున్నట్లు బయటపడింది. నిందితుడు దిల్లీలోని పాక్ హై కమిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగికి వీటిని అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నిందితుడిని రజాకా గ్రామం, నుహ్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అధికారులు నిందితుడి ఫోన్, ఇతర ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని కొన్ని ఫోన్ నంబర్లకు వీడియోలు, ఫొటోలను పంపుతున్నట్లు గుర్తించారు. నిందితుడుని కోర్టులో ప్రవేశపెట్టగా 6 రోజుల పోలీస్ కస్టడీకి అందించటం జరిగిందని తేలింది. 

మరోపక్క నిందితుడి కుటుంబం మాత్రం తన కుమారుడు చాలా మంచివాడని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు నిందితుడి కుటుంబాన్ని ప్రశ్నించలేదని తేలింది. పోలీసులు చేస్తు్న్న ఆరోపణలు పూర్తిగా తప్పని, తమ కుటుంబానికి పాకిస్థాన్ లో బంధువులు ఉన్నారని వారు చెబుతున్నారు. దీనికి ముందు పోలీసులు జ్యోతి రాణీ అనే ట్రావెల్ యూట్యూబర్ ని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాకిస్థాన్ హైకమిషన్ తో పరిచయాలు కలిగి ఉండటంతో పాటు అనేకసార్లు పాక్ కూడా వెళ్లి వచ్చినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించటం జరిగింది.