- మెన్స్, ఉమెన్స్ విభాగాల్లోనూ గెలిచిన హర్యానా టీమ్స్
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని యైటింక్లైన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించిన డార్జ్ బాల్ నేషనల్ లెవల్ పోటీలు గురువారంతో ముగిశాయి. పురుషులు, మహిళల విభాగంలో హర్యానా జట్లే విజయం సాధించాయి. మెన్స్ విభాగంలో తమిళనాడు సెకండ్ ప్లేస్, కర్నాటక థర్డ్ ప్లేస్‌లో నిలువగా బెస్ట్ ప్లేయర్‌గా హర్యానాకు చెందిన అమన్ ఎంపికయ్యాడు. ఉమెన్స్ విభాగంలో కర్నాటక టీం సెకండ్ ప్లేస్, గుజరాజ్ థర్డ్ ప్లేస్ సాధించగా, బెస్ట్ ప్లేయర్‌గా హర్యానాకు చెందిన వంశీక ఎంపికైంది.
గెలుపొందిన టీమ్స్‌కు గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, సింగరేణి ఆర్జీ 2 ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ ప్రైజ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఆటలకు సింగరేణి సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐ రవీందర్, డార్జ్ బాల్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, శంకర్‌నాయక్, జిగురు రవీందర్, రాజేంద్రప్రసాద్, టంగుటూరి రాజయ్య, పాశం శ్రీనివాస్, ఓదెలు యాదవ్ పాల్గొన్నారు.
